పామ్ ఆయిల్ దిగుమతి సుంకం తగ్గింపుపై ఫైర్

విజ‌య‌వాడ‌ : పామ్ ఆయిల్ దిగుమతి సుంకం తగ్గింపును వ్యతిరేకించాయి ఆయిల్ పామ్ రైతులు. 2019-20లో ముడి, శుద్ధి చేసిన పామ్ ఆయిల్ సుంకాల మధ్య వ్యత్యాసం 7.5 శాతంగా ఉండగా, అది ఇప్పుడు 24.75 శాతానికి పెరిగిందని రైతు నాయకులు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది రైతులు దిగుమతి చేసుకున్న పామ్ ఆయిల్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని నేషనల్ ఆయిల్ పామ్ ఫార్మర్స్ అసోసియేషన్ (NOFA) , మూడు రాష్ట్రాల ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘాలు తెలిపాయి. పామ్ ఆయిల్ పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 10 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , కర్ణాటకలోని ఆయిల్ పామ్ రైతు సంఘాలు వ్యతిరేకించాయి; ఈ చర్య దేశీయ సాగుదారులపై ప్రభావం చూపుతుందని వారు పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది రైతులు దిగుమతి చేసుకున్న పామ్ ఆయిల్ నుండి తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి వస్తుందని NOFA , మూడు రాష్ట్రాల ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘాలు తెలిపాయి. NOFA ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్ రెడ్డి, ఏపీ ఆయిల్ పామ్ రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బొబ్బా వీర రాఘవ రావు మాట్లాడారు. సాగుదారుల ఆందోళనలను పరిష్కరించకుండా ప్రభుత్వం రిఫైనింగ్ పరిశ్రమకు అనుకూలంగా విధానాన్ని రూపొందించిందని ఆరోపించారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల హైదరాబాద్‌ను సందర్శించినప్పుడు ఏపీ , తెలంగాణ వ్యవసాయ మంత్రులు దిగుమతి సుంకాన్ని పెంచాలని , తాజా పండ్ల గుత్తుల (FFB) కనీస మద్దతు ధరను టన్నుకు రూ. 25,000కు పెంచాలని కేంద్రాన్ని కోరారన్నారు.

  • Related Posts

    పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం

    వైఎస్సార్ క‌డ‌ప జిల్లా : పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, మానవత్వం ఎంతో కీలకం. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించేలా పనిచేయాలి. పోలీసు- అంటే భయం కాదు.. ప్రజలకు భరోసా అనే భావన ప్రజల్లో కలిగేలా ప్రతి ఒక్కరూ…

    సీబీఎస్ఈ ఛైర్మన్ గా మన్‌దీప్ భండారి

    న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీబీఎస్ఈ ఛైర్‌పర్సన్‌గా మ‌న్ దీప్ భండారిని నియ‌మించింది. ఇవాళ అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆయ‌ నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. ఏజీఎంయూటీ (అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం మరియు కేంద్రపాలిత ప్రాంతాలు)…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *