
ప్రధానితో పాటు పలువురు ముఖ్యమంత్రుల ఖండన
ఢిల్లీ : దేశమంతటా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పై జరిగిన దాడి పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. తనపై బూటు విసిరేందుకు ప్రయత్నం చేశారు లాయర్ రాకేశ్ కిషోర్. విష్ణువు పట్ల అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేశారని అందుకే తనకు బాధ కలిగిందని పేర్కొన్నారు. తను దాడికి పాల్పడడం పట్ల సమర్థించుకున్నాడు సదరు లాయర్. అంతే కాదు ఎలాంటి చింతించడం లేదని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ లతో పాటు దేశంలోని ప్రజాస్వామిక వాదులు, సోషల్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, కొందరు సినీ రంగానికి చెందిన వారు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దాడి సీజేఐపై జరిగినది కాదని భారత దేశ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు జరిగే ఛాన్స్ లేక పోలేదని ఆవేదన చెందారు.
ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఈ ఘటన జరగడం పట్ల సర్వత్రా చర్చకు దారి తీయగా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు జస్టిస్ సీజేఐ. కేసు విచారణను ఆయన కొనసాగించారు. ఎక్కడా ఆందోళనకు గురి కాలేదన్నారు. ఈ దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, అది వారి విక్షణకే వదిలి వేస్తున్నట్లు స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్. తనపై దాడికి ప్రయత్నం చేసిన లాయర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశించారు. అయితే రిజిస్ట్రార్ మాత్రం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నుంచి రాకేష్ కిషోర్ పై తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది.