కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ కూతురికి ఎమ్మెల్సీ..?

హైద‌రాబాద్ : తెలంగాణలో గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ (MLC) స్థానాలను త్వరగా భర్తీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ స్థానాల్లో ఒకదాని కోసం తెలంగాణ ఉద్యమ పితామహులలో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె పవిత్రవాణి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆమె ప్రస్తుతం వైద్య వృత్తిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969లో జరిగిన ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నాయకుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచి పోయారు.

ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం కోట్లాది రూపాయ‌లు విలువ చేసే స్థ‌లాన్ని కార్యాల‌యం కోసం ఉచితంగా ఇచ్చారు కొండా లక్ష్మ‌ణ్ బాపూజీ. ఇదిలా ఉండ‌గా రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉద్యమకారుల కుటుంబాలను విస్మరించిందని రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచే ఆరోపిస్తూ వస్తున్నారు. సీఎం అయ్యాక రేవంత్ ఆ దిశగా చర్యలు తీసుకుంటూ, ప్రొఫెసర్ కోదండరామ్‌ను ఎమ్మెల్సీగానూ, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను , చాకలి ఐలమ్మ కోడలిని మహిళా కమిషన్ సభ్యులు గానూ నియమించారు. ఈ క్రమం లోనే బాపూజీ కుమార్తెకు కూడా అవకాశం కల్పించాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం.

  • Related Posts

    హౌసింగ్ ఫర్ ఆల్‌కు సహకరించండి : సీఎం

    అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న హౌసింగ్ ఫర్ ఆల్ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ మరో లేఖ రాశారు. 3 లక్షల…

    మ‌హిళ‌ల‌ను కించప‌రిస్తే చూస్తూ ఊరుకోం : విజ‌య్

    చెన్నై : త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మ‌హిళ‌ల ప‌ట్ల ఎవ‌రు చుల‌క‌న చేసి మాట్లాడినా లేదా దూషించినా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రినీ వ‌దిలే ప్ర‌స‌క్తి లేద‌న్నారు సీఎం. ఆదివారం తిరుప్పూర్ జిల్లాలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *