దివ్యాంగులకు పూర్తి స‌హ‌కారం అందిస్తాం : రామ్మోహ‌న్ నాయుడు

శ్రీ‌కాకుళం జిల్లా : కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు శ్రీ‌కాకుళం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ₹1.5 కోట్ల CSR సహకారంతో, ALIMCO భాగస్వామ్యంతో 230 బ్యాటరీ ట్రైసైకిళ్లను దివ్యాంగ సోదర సోదరీమణులకు అందించారు కేంద్ర మంత్రి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మన దివ్యాంగ సోదర సోదరీమణుల జీవితాల్లో ఒక అర్థవంతమైన మార్పు తీసుకు రావడం కేవలం బాధ్యత మాత్రమే కాదు, ప్రాధాన్యత కూడా అని పేర్కొన్నారు.

మనం చేసే చిన్న సహాయం వారి జీవితాల్లో ఎంతో పెద్ద మార్పు తీసుకు రాగలదని అన్నారు కేంద్ర మంత్రి. ప్రతి సవాలును, ప్రతి అడ్డంకిని అధిగమించి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతున్న వారి ధైర్యం, పట్టుదల, సంకల్పం నాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంద‌న్నారు రామ్మోహ‌న్ నాయుడు. వారికి ఎల్లప్పుడూ నా పూర్తి సహకారం, అండగా ఉంటానని హామీ ఇస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను చేపడ‌తామ‌ని చెప్పారు. మన దివ్యాంగ సోదర సోదరీమణులు ఆత్మ గౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు అన్ని విధాలా కృషి చేస్తామ‌ని తెలిపారు.

  • Related Posts

    క‌ర్ణాట‌క‌లో 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ : సీఎం

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇక నుంచి 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం డీకే శివ‌కుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్ ఆసక్తి చూపింద‌న్నారు.…

    ద‌స‌రా పండుగ‌కు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు

    అమ‌రావ‌తి : ఏపీఎస్ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద‌స‌రా సెలువులు ప్ర‌క‌టించ‌డంతో ఏపీఎస్ఆర్టీసీ కీల‌క నిర్న‌యం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా APSRTC ప్రత్యేక బస్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దసరా ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *