ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై క‌మిష‌న‌ర్ ఫోక‌స్

హైద‌రాబాద్ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ‌జ‌న ఆధ్వ‌ర్యంలో ప్రజావాణి’ కార్యక్రమం నిర్వ‌హించారు. భారీ ఎత్తున ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెట్టారు. ప్ర‌జావాణిలో భాగంగా పౌరులతో నేరుగా మాట్లాడారు క‌మిష‌న‌ర్. వారి సమస్యలను ఆలకించి, సంబంధిత శాఖల అధికారులతో (HODs) కలిసి ఆయా అంశాలను సమీక్షించారు. ఈ ప్ర‌జావాణిలో మొత్తం 44 ఫిర్యాదులు స్వీక‌రించిన‌ట్లు తెలిపారు క‌మిష‌న‌ర్. వ‌చ్చిన ఫిర్యాదుల‌లో ఎక్కువ శాతం ప‌ట్ట‌ణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన‌వే ఉన్నాయ‌ని తెలిపారు. ఈ ఒక్క విభాగంలోనే 31 ఫిర్యాదులు అందాయి. ఇక ఇంజ‌నీరింగ్ విభాగంలో 6 , ప‌ట్ట‌ణ జీవ వైవిధ్యానికి సంబంధించి 2, ఎస్టేట్స్ , ఆహార భ‌ద్ర‌త , రెవిన్యూ, పారిశుధ్యం , ప‌ట్ట‌ణ సామాజిక
అభివృద్దికి సంబంధించి ఒక్కో ఫిర్యాదు చొప్పున వ‌చ్చాయ‌ని తెలిపారు క‌మిష‌న‌ర్ శ్రీ‌జ‌న‌.

ప్రతి ఫిర్యాదుకూ ఒక ప్రత్యేకమైన ‘గ్రీవెన్స్ ఐడి’ (Grievance ID) , ట్రాకింగ్ లింక్ కేటాయించడం జ‌రిగింద‌న్నారు; దీనివల్ల పౌరులు తమ ఫిర్యాదు స్థితిని , పరిష్కార ప్రక్రియను స్వయంగా తెలుసుకునే వీలుంటుందని అన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, నిర్ణీత గడువులోగా తగిన చర్యలు తీసుకోవాలని ,సమస్య పరిష్కారమయ్యే వరకు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

  • Related Posts

    క‌ర్ణాట‌క‌లో 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ : సీఎం

    బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలోని ప్ర‌భుత్వ బ‌డుల్లో ఇక నుంచి 6వ త‌ర‌గ‌తి నుండే ఏఐపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం డీకే శివ‌కుమార్. పాఠశాలల్లో ఏఐ శిక్షణను అందించడానికి గూగుల్ ఆసక్తి చూపింద‌న్నారు.…

    ద‌స‌రా పండుగ‌కు ఏపీఎస్ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సులు

    అమ‌రావ‌తి : ఏపీఎస్ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ద‌స‌రా సెలువులు ప్ర‌క‌టించ‌డంతో ఏపీఎస్ఆర్టీసీ కీల‌క నిర్న‌యం తీసుకుంది. దసరా రద్దీ దృష్ట్యా APSRTC ప్రత్యేక బస్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. దసరా ప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *