భద్రతకు అవగాహనే తొలి అడుగు : సీపీ

హైద‌రాబాద్ : మ‌ల్కాజిగిరి పోలీస్ జోన్ ప‌రిధిలో భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు . ఎల్.బి. నగర్ షీ టీమ్స్ ఆధ్వ‌ర్యంలో రెడ్డి బ్రదర్స్ షాపింగ్ మాల్‌లో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్స్, సైబర్ క్రైమ్, లోన్ యాప్ మోసాలు, మానవ అక్రమ రవాణా, లింగ సమానత్వంపై అవగాహన, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులు, మంచి స్పర్శ చెడు స్పర్శ, సీసీటీవీ భద్రత, టీ-సేఫ్ యాప్ , సీడీఈడబ్ల్యూ కౌన్సెలింగ్ కేంద్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రజలు ప్రమాదాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు. సకాలంలో సహాయం పొందేందుకు వీలుగా నిజ జీవిత కేసులను పంచుకున్నారు. వేధింపులు, దుర్వినియోగం , ఇతర భద్రతా సమస్యలపై మాట్లాడాలని కోరారు. అందుబాటులో ఉన్న సహాయ సేవలను ఉపయోగించు కోవాలని వారిని ప్రోత్సహించారు. తక్షణ పోలీసు సహాయం కోసం, 112కు డయల్ చేయాల‌ని సూచించారు. లేదా మల్కాజిగిరి కమిషనరేట్ లోని 8712662111 నంబర్‌కు వాట్సాప్ చేస్తే వెంట‌నే స్పందిస్తామ‌ని, త‌క్ష‌ణ సాయం పొందేలా చేస్తామ‌న్నారు.

  • Related Posts

    అస‌భ్య‌క‌ర పోస్టుల‌పై ఎమ్మెల్సీ బ‌ల్మూరి ఫిర్యాదు

    హైద‌రాబాద్ : ఈ మ‌ధ్య‌న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిప‌క్షంలో ఉన్న బీఆర్ఎస్ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తూ మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం అన్ని పార్టీల‌కు ఓ ఆయుధంగా…

    రైల్వే ఉద్యోగుల‌కు సెటిల్‌మెంట్ పత్రాలు పంపిణీ

    గుంత‌క‌ల్ : పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు సెటిల్‌మెంట్ పత్రాలను పంపిణీ చేశారు గుంత‌క‌ల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ( డీఆర్ఎం) చంద్ర ఎస్. గుప్తా. డివిజనల్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో పదవీ విరమణ చేస్తున్న 8 మంది ఉద్యోగులకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *