క‌రూర్ బాధితుల‌కు విజ‌య్ వీడియో కాల్

త్వ‌ర‌లోనే ప‌రిహారం కూడా ఇస్తాన‌ని ప్ర‌క‌ట‌న

చెన్నై : టీవీకే పార్టీ చీఫ్‌, ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ మంగ‌ళ‌వారం క‌రూర్ ఘ‌ట‌న‌లో మృతి చెందిన 41 కుటుంబాల బాధితుల‌తో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈ మేర‌కు వీడియో కాల్స్ చేశారు. త్వ‌ర‌లోనే మీ వ‌ద్ద‌కు వ‌స్తాన‌ని, మీకు ఎల్ల‌ప్పుడూ అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. ఎవ‌రూ ఆందోళ‌న చెందవ‌ద్ద‌ని కోరారు. ఇదే స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి పూర్తిగా పార్టీ ప‌రంగా వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు వీజ‌య్. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. 10 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ఇస్తామ‌న్నారు. అంతే కాకుండా గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇదే స‌మ‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే బాధిత కుటుంబాల‌ను స్వ‌యంగా సంద‌ర్శించారు. బాధిత కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి కేంద్రం అండ‌గా ఉంటుంద‌న్నారు. ఈ మేర‌కు కేంద్రం త‌ర‌పున ఒక్కో కుటుంబానికి రూ. 2 ల‌క్ష‌లు, గాయ‌ప‌డిన వారికి వైద్య ఖ‌ర్చుల నిమిత్తం రూ. 50 వేలు ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌తో ఒక్క‌సారిగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు న‌టుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. ఈ మేర‌కు బాధిత కుటుంబాల కోసం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఒక్కో కుటుంబానికి పార్టీ త‌ర‌పున రూ. 20 ల‌క్ష‌లు ఇస్తాన‌ని తెలిపారు. ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి పూర్తి వైద్య ఖ‌ర్చులు భ‌రిస్తాన‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేటీఆర్

    హామీల అమ‌లులో సీఎం పూర్తిగా వైఫ‌ల్యం హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ నైజ‌మ‌ని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంగ‌ళ‌వారం జూబ్లీహిల్స్ నియోజ‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్ మహానగరంలో ఉన్న లక్షా 20 వేల…

    హైడ్రాను అభినందించిన హైకోర్టు

    చెరువుల పున‌రుద్ధ‌ర‌ణను య‌జ్ఞంలా చేస్తోంది హైద‌రాబాద్ : గ‌త కొంత కాలంగా తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న హైడ్రా ప‌ని తీరును అభినందించింది హైకోర్టు. న‌గ‌రంలో చెరువుల అభివృద్ధిని ఓ య‌జ్ఞంలా చేస్తోంద‌ని కితాబిచ్చింది. అందుకు న‌గ‌రంలో అభివృద్ధి చెందిన చెరువులే సాక్ష్యమ‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *