జ‌గ‌న్ రెడ్డిని జ‌నం న‌మ్మ‌రు : నాదెండ్ల

అమ‌రావ‌తి : రాయలసీమ నుంచి పరిశ్రమలను తరిమేసిన పాపం వైసీపీదేన‌ని మండిప‌డ్డారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. జ‌నం జ‌గ‌న్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితి లేద‌న్నారు. 2019-24 మధ్య వైసీపీ పాలనా సమయంలో రాయలసీమ నుంచి ఎన్నో అద్భుతమైన పరిశ్రమలను ఆ పార్టీ నాయకులు తరిమేశారు. వైసీపీ నాయకుల బెదిరింపులు, దౌర్జన్యాల దెబ్బకు ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అప్పట్లో వైసీపీ నాయకులు చేయని దాష్టికం లేదు. 2014-19 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో రాయలసీమకు వచ్చిన కియా పరిశ్రమ, వైసీపీ హయాంలో తన అనుబంధ సంస్థలను రాయలసీమలో ఏర్పాటు చేయడం కోసం సిద్ధం ఐతే వైసీపీ ఎంపీ ఏకంగా కియా మోటార్స్ యాజమాన్య ప్రతినిధులపై చేసిన బెదిరింపులు ప్రపంచమంతా చూసింది. అప్పట్లో ఆ ఎంపీ చేసిన అరాచకం వల్ల కియా మోటార్స్ తన అనుబంధ విభాగాలను చెన్నై, కర్ణాటక ప్రాంతాలకు తరలించింది.

రాష్ట్రానికి చెందిన ఎంపీ అప్పట్లో రూ. 9,500 కోట్లతో అమరరాజా పరిశ్రమలు పెడతాను అంటే అప్పటి వైసీపీ పాలకులు సహకరించలేదు. ఆ పరిశ్రమ తెలంగాణకు వెళ్ళిపోయింది. అనంతపురం జిల్లాలో జాకీ పరిశ్రమ ప్రతినిధులను వైసీపీ నాయకులు బెదిరించడంతో ఆ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా వెళ్ళిపోయింది. రూ. 24 వేల కోట్ల భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చిన ఏషియా పల్ప్ పేపర్ ఇండస్ట్రీ ని వైసిపి నాయకులు బెదిరించడంతోనే వెనక్కు వెళ్లిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో రేణిగుంటలో పరిశ్రమ పెట్టడానికి ముందుకు వస్తే కనీసం భూమి కూడా కేటాయించలేదు. పరిశ్రమలను ముప్పుతిప్పలు పెట్టిన వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత యువతకు ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు గురించి మాట్లాడుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యం

    చెన్నై : త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ స‌త్తా చాటింది. దీంతో సీఎం ప‌నితీరుకు ఇది అద్దం ప‌డుతోంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. మధురాంతకం నియోజకవర్గంలో మరకతం కుమారవేల్ 17,554 ఓట్ల…

    సుప్రీం కోర్టు తీర్పును శిరవహిస్తాం : ఎస్. స‌విత

    పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దీనిపై శుక్ర‌వారం ఎస్. స‌విత స్పందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *