ఓట్ల చోరీతోనే మోదీ ప్ర‌ధాని అయ్యారు : ధ్రువ్ రాఠీ

బెంగ‌ళూరు : ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ధ్రువ్ రాఠీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గురువారం బెంగ‌ళూరులో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓట్ల చోరీ జ‌రిగింద‌న్నారు. ఈ ప్ర‌క్రియ అంతా కేవ‌లం భారతీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి రావ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ ప‌డింద‌ని ఆరోపించారు. ఇదే క్ర‌మంలో ఓట్లను దొంగిలించి, తొలగించి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ ప్రధాని అయ్యారని బాంబు పేల్చారు . బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపి ఓట్లు తొలగించారని ఆరోపించారు. చనిపోయింది ప్రజలు కాదని, అది దేశ ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సూచనలతోనే కేంద్ర ఎన్నిల‌క సంఘం కమిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ ఓట్లు తొలగించారని ఆరోపించారు. RSS భావజాలం రాజ్యాంగం, అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నారు. గాంధీ ఆత్మ.. అంబేద్కర్ వెన్నుముక.. నెహ్రూ మేధస్సు ఈ దేశం అన్నారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఈ భావజాలంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్పు కోసం నేను ఇక్కడికి రాలేదన్నారు ధ్రువ్ రాఠీ. ఎలాన్ మస్క్, జార్జ్ సోరోస్ నుంచి తనకు ఎలాంటి నిధులు అందలేదన్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎవరు ఓటేసినా.. ఇది ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. బీహార్‌లో 65 లక్షల మంది ఓట్లు తొలగించారని..కానీ ఇందుకు సంబంధించి వివరాలు ఎందుకు వెల్ల‌డించడం లేదంటూ ప్ర‌శ్నించారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యం

    చెన్నై : త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ స‌త్తా చాటింది. దీంతో సీఎం ప‌నితీరుకు ఇది అద్దం ప‌డుతోంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. మధురాంతకం నియోజకవర్గంలో మరకతం కుమారవేల్ 17,554 ఓట్ల…

    సుప్రీం కోర్టు తీర్పును శిరవహిస్తాం : ఎస్. స‌విత

    పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దీనిపై శుక్ర‌వారం ఎస్. స‌విత స్పందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *