స్థానిక సంస్థల ఎన్నికలపై ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్రత్యేక దృష్టి

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై సీరియ‌స్ గా ఫోక‌స్ పెట్టారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇప్ప‌టికే గ‌త శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించ‌డం జ‌రిగింది. ఈసారి జ‌రిగే లోకల్ బాడీ ఎన్నిక‌ల్లో కూడా స‌త్తా చాటాల‌ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు దిశా నిర్దేశం చేశారు. ఇందు కోసం స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్లమెంటరీ అడ్‌హాక్ కమిటీల ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుల స్వీయ పర్యవేక్షణలో పని చేయనున్నాయి ఏర్పాటైన‌ కమిటీలు. విజయవాడ పార్లమెంట్ మినహా మిగతా పార్లమెంట్ కమిటీలు ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

త్వరలో ప్రతీ పార్లమెంట్ కమిటీతో సమావేశం అవ్వాలని ఈ సంద‌ర్భంగా ఆదేశించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరో 4 కేంద్ర కమిటీల నియామకం జ‌రిగింది. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేశారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ . పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయి సమాచార సేకరణ, ఎన్నికల సన్నద్ధతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కమిటీల పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తూ, త్వరలో కమిటీ సభ్యులతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. వీటితో పాటు ఎన్నికల నిర్వహణ & మార్గదర్శక కమిటీ, కూటమి సమన్వయ కమిటీ, ప్రచార కమిటీ, ట్రెజరీ కమిటీలను కూడా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • Related Posts

    త‌మిళ‌నాడు ఉప ఎన్నిక‌ల్లో టీవీకే విజ‌యం

    చెన్నై : త‌మిళ‌నాడులో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న టీవీకే పార్టీ స‌త్తా చాటింది. దీంతో సీఎం ప‌నితీరుకు ఇది అద్దం ప‌డుతోంది. రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఈ ఉప ఎన్నిక‌లు జ‌రిగాయి. మధురాంతకం నియోజకవర్గంలో మరకతం కుమారవేల్ 17,554 ఓట్ల…

    సుప్రీం కోర్టు తీర్పును శిరవహిస్తాం : ఎస్. స‌విత

    పెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. దీనిపై శుక్ర‌వారం ఎస్. స‌విత స్పందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *