ఏపీకి 16 నెల‌ల్లో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు

వ‌చ్చాయ‌న్న ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్

సిడ్నీ (ఆస్ట్రేలియా) : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని చెప్పారు మంత్రి నారా లోకేష్. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జ‌రిగిన తెలుగు వారి స‌మావేశంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన‌ప్పుడు ఎన్నారైలు ఎక్కువ‌గా ఆందోళ‌న‌లు చేప‌ట్టార‌ని ప్ర‌శంసించారు. సముద్రాలు దాటినా సొంత ఊరు, సొంత రాష్ట్రం అంటే మీకుకున్న ప్రేమ గొప్ప‌ద‌న్నారు. ఆస్ట్రేలియా లోని ప్రతి సిటీ లో మీరు నిరసన కార్యక్రమాలు చేశార‌ని, మా కుటుంబానికి అండగా నిలబడ్డారని అన్నారు. ఆ రోజు హైదరాబాద్ లో 45వేల మంది వచ్చి మాకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. అప్పుడే ప్రజలకు సేవ చేయాలని, మెప్పు పొందాలని సంకల్పించానని చెప్పారు. సొంత రాష్ట్రాన్ని కాపాడేందుకు 2024 ఎన్నికలను మీ సొంత ఎన్నికల్లా భావించారు. మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో అదే విధంగా ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారని అన్నారు లోకేష్‌.

మీరు మాకు అద్భుతమైన మాండేట్ ఇచ్చారు. 50 మంది ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచారు. అందులో నేనూ ఒకడిని. 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులు కొత్తవారు. కసితో, పట్టుదలతో పనిచేస్తున్నాం అన్నారు. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు చేసి తెలుగువారిని తలెత్తుకుని తిరిగేలా చేశారో.. అదే మ్యాజిక్ చేయాలని అహర్నిశలు కష్టపడుతున్నాం అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. రెండింటినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలి. గత 16 నెలలుగా మీరు చూస్తే.. ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క ఏపీకి వచ్చాయని చెప్పారు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం న్నారు.

అనంతపూర్ ను ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర అనంతపూర్, కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. లైమ్ స్టోన్ ఉన్న దగ్గర సిమెంట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మారుస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. నెల్లూరుకు రిఫైనరీని కూడా తీసుకు రాబోతున్నాం. ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, కృష్ణా, గుంటూరు జిల్లాలను క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలను ఢిఫెన్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నామ‌ని అన్నారు. కర్నూలుకు డ్రోన్ సిటీని ఇప్పటికే ప్రకటించాం. పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఉత్తరాంధ్రను మెడికల్ డివైజ్ మ్యానుఫాక్చరింగ్, ఫార్మా హబ్ తో పాటు స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతోంది మీ ప్రజా ప్రభుత్వం అని అన్నారు లోకేష్‌.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *