ANDHRA PRADESHNEWS

విద్యాభివృద్దికి ఎంతైనా ఇస్తాం

Share it with your family & friends

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి – రాష్ట్రంలో విద్యాభివృద్దికి ఎన్ని కోట్ల‌యినా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. విద్యా శాఖ‌పై సీఎం స‌మీక్షించారు. ఇప్ప‌టికే నాడు నేడు ప‌థ‌కం కింద కార్పొరేట‌ర్ స్కూళ్ల‌కు ధీటుగా తీర్చిదిద్ద‌డం జ‌రిగింద‌ని తెలిపారు.

రాష్ట్రంలో తాము వ‌చ్చాక విద్య, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌ని అన్నారు. ఏ రంగంలోనైనా అభివృద్ది సాధించాలంటే చ‌దువుపై ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంద‌న్నారు. ప్ర‌పంచంలో పోటీ ప‌డే విధంగా ఏపీకి చెందిన యువ‌త త‌యారు కావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

నిరంత‌ర శిక్ష‌ణ అనేది విద్యార్థుల‌తో పాటు టీచ‌ర్ల‌కు కూడా అత్యంత అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా జ‌న‌వ‌రి 31న రాష్ట్ర స‌ర్కార్ తో ఐబీ కంపెనీ ఒప్పందం చేసుకుంటుంద‌ని చెప్పారు. విద్యా శాఖ‌లో టీచ‌ర్ల‌తో స‌హా సిబ్బంది, అధికారుల‌కు శిక్ష‌ణ ఇస్తార‌ని అన్నారు.

2025-26 విద్యా సంవ‌త్స‌రం నుంచి ఐబీ విద్యా బోధ‌న ఒక‌టో త‌ర‌గతితో ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు సీఎం. ప్ర‌భుత్వ బ‌డుల్లో ఫ్యూచ‌ర్ స్కిల్స్ పై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. ప్ర‌తి మూడు పాఠ‌శాల‌ల‌కు ఇందుకు సంబంధించిన ఒక నిపుణుడు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.