అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు

Spread the love

నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో

తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2 ప్రాంతాలలో, అనకాపల్లి జిల్లాలో 1 ప్రాంతంలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో ఉదయం 11 గంటలకు, అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి . అక్టోబర్ 27వ తేదీన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలోని అగ్రహారం గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది. 30వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గం.లకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. నవంబర్ 01వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి మండలం లోని గొందిపాకాల (లంబ సింగి) గ్రామంలోని శ్రీ నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

3వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో సాయంత్రం 6 గం.లకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. నవంబర్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండల కేంద్రంలోని జీ.టీ.డబ్ల్యూ.ఏ హైస్కూల్ గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో హరికథ, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • Related Posts

    ఘ‌నంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    Spread the love

    Spread the loveఏప్రిల్ 27వ తేదీన ర‌థోత్స‌వం నిర్వ‌హ‌ణ తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 7.30 నుండి 9 గంటల మధ్య…

    ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజ‌లు

    Spread the love

    Spread the loveఆయ‌న ఆరోగ్య ప‌రంగా త్వ‌ర‌గా కోలుకోవాలి అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల ఈ మ‌ధ్య‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు. నీర‌సంగా అనిపించ‌డంతో ఆస్ప‌త్రికి వెళ్లారు. అక్క‌డ త‌క్ష‌ణ‌మే త‌న‌కు శ‌స్త్ర చికిత్స…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *