మార్ఫింగ్ వీడియోపై జూనియ‌ర్ ఎన్టీఆర్ సీరియ‌స్

హైద‌రాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు సంబంధించి మార్ఫింగ్ వీడియోలు త‌యారు చేసినా లేదా షేర్ చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ వీడియోపై తన ఎక్స్ టైమ్‌లైన్‌లో స్పందించారు న‌టుడు శ‌నివారం. అసహ్యకరమైనది, రోత పుట్టించేది , సిగ్గులేనిది అంటూ మండిప‌డ్డారు. తన చిత్రం ‘దేవర’లోని ‘చుట్టమల్లె’ పాటకు మార్ఫింగ్ వీడియోను సృష్టించి, దానిని వ్యాప్తి చేస్తున్న వారిపై సాధ్యమైన అన్ని చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. మహిళలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ గడ్డపై మాతృదేవో భవ అనేది కేవలం ఒక మాట మాత్రమే కాకుండా మన సంస్కృతిలో భాగమైన చోట, కొందరు వ్యక్తులు ఎంతగా దిగజారి పోయారంటే, ఒక మహిళను అత్యంత అవమానకరమైన రీతిలో కించ పరచడానికి ఏఐ (AI)ని ఉపయోగిస్తున్నారని మండిప‌డ్డారు ఎన్టీఆర్.

ఇంత నీచమైన దాన్ని సృష్టించడానికి ఏఐని ఉపయోగించడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు అని పేర్కొన్నారు. మార్ఫింగ్ చేసిన వీడియోను ప్రచారం చేసిన దుండగులను ఆ నటుడు నేరుగా ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఇలా రాశారు ఈ మార్ఫింగ్ చేసిన చుట్టమల్లె వీడియో వెనుక ఉన్న నీచులారా, మీలో ఎవరినీ నేను వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారి పైనా, వ్యాప్తి చేస్తున్న వారిపైనా సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను అని వార్నింగ్ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఇతర నెటిజన్లకు కూడా ఇలాంటి కంటెంట్‌ను చూడవద్దని, పంచుకోవద్దని లేదా దానితో సంబంధం పెట్టుకోవద్దని తీవ్రంగా విజ్ఞప్తి చేశారు.

  • Related Posts

    బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న డైరెక్ట‌ర్ చందూ మొండేటి

    హైద‌రాబాద్ : దర్శకుడు చందూ మొండేటి అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటిలతో కలిసి ఒక లఘు చిత్రంతో బాలీవుడ్ దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంజయ్…

    9న వెంక‌టేశ్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదల

    హైదరాబాద్ : మాట‌ల మాంత్రికుడు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ఆద‌ర్శ కుటుంబంపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ , పాట‌కు మంచి ఊపు వ‌చ్చేలా చేసింది. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు సినిమాకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *