నవంబర్ 16న గోష్పాద క్షేత్రంలో గోదావరి హారతి

తిరుపతి : గోదావరి నదికి ఆధ్యాత్మిక సంప్రదాయ బద్ధంగా హారతి సమర్పించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపినాథ్ శనివారం టిటిడి శ్వేత సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. టిటిడి, దాస సాహిత్య ప్రాజెక్ట్, పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులతో ఈ గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జేఈవో ప్రభల గోపినాథ్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో నదులను జీవన దాతలుగా, దైవ స్వరూపాలుగా భావించి వాటికి పూజలు, హారతులు సమర్పించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని తెలిపారు. నదీ దేవతకు దీపారాధన, హారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, నదులు పుష్కలంగా ప్రవహించి సమస్త జీవరాశులకు జీవనాధారంగా నిలవాలని ప్రార్థించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

నవంబర్ 16న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని గోష్పాద క్షేత్రంలో సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు గోదావరి హారతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు జేఈవో వెల్లడించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గోదావరి మాత ఆశీస్సులతో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దాససాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు, హిందూ ధర్మ ప్రచార పరిషత్ చీఫ్ డా. మేడసాని మోహన్, శ్వేత ఇన్‌ఛార్జి సంచాలకులు డా. వేమా వేంకట రత్నం, డిపిపి అదనపు కార్యదర్శి కళ్యాణి, డిపిపి ఏఈవో సిహెచ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అప్పలాయగుంట‌ ఆలయానికి ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డు’

    తిరుపతి : మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీకి చెందిన అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ప్రతిష్ఠాత్మకమైన స్వచ్ఛ ఆంధ్ర అవార్డు – 2026ను ప్రదానం చేసింది. తిరుపతిలోని తుడా కార్యాలయ ప్రాంగణంలోని కచ్చపి ఆడిటోరియంలో…

    గాంధీజీ స్ఫూర్తితో భక్తులకు సేవ‌లు అందించాలి

    తిరుమ‌ల : జాతిపిత మహాత్మా గాంధీజీ స్ఫూర్తితో టీటీడీ ఉద్యోగులు మరింత నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) ప్రభల గోపీనాథ్ కోరారు. స్వచ్ఛత, పరిశుభ్రతకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *