DEVOTIONAL

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Share it with your family & friends

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు

తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కింది తిరుమ‌ల పుణ్య క్షేత్రం. తెలుగు వారే కాకుండా దేశ, విదేశాల నుండి స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు త‌ర‌లి వ‌స్తారు. రోజు రోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరుగుతోందే త‌ప్పా ఎంత‌కూ త‌గ్గ‌డం లేదు. వ్య‌య ప్ర‌యాస‌ల కోర్చి అలిపిరి , శ్రీ‌వారి మెట్ల ద్వారా వ‌చ్చే న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

ఇక శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 65 వేల 962 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 24 వేల 575 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

ప్ర‌స్తుతం భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం డైరెక్ట్ లైన్ లో వేచి ఉన్నార‌ని, ఇక ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు క‌నీసం 8 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.