సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న హ‌రీశ్ రావు

ల‌క్ష ఇళ్లు కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల‌క్ష ఇళ్లు క‌ట్టిస్తే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ల‌క్ష ఇళ్ల‌ను కూల్చి వేశాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. తెలంగాణ భ‌వ‌న్ లో వ‌డ్డెర సంఘం ప్ర‌తినిధుల‌తో స‌మావేశం అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్ . క్యాబినెట్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు బట్టలూడ తీసుకొని తిట్టుకున్నారని ఆరోపించారు. ఇక ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ఎలా ఆలోచిస్తార‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ ప్రజల గురించి చూడడం లేదు. వాళ్ళు తన్నుకోడానికి, వాటాలు పంచు కోవడానికి సరిపోతోంద‌న్నారు. మల్లా కేసీఆర్ వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే, హైడ్రా ఆగి పోవాలంటే కాంగ్ర‌స్ పార్టీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు.

ఎలక్షన్ ముంగట మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని గ్యారెంటీ కార్డు ఇచ్చారు. రెండు వేల పెన్షన్ రూ. 4000 చేస్తామన్నారు, చేశారా కాంగ్రెస్ వాళ్ళు అని ప్ర‌శ్నించారు. రూ. 200 ఉన్న పెన్షన్ కేసీఆర్ రూ. 2000 చేసిండని, రూ. 4000 పెన్షన్ ఇవ్వక పోయినా మహిళలకు రూ. 2500 ఇవ్వ‌క పోయినా నాకే ఓటేశారు అని రేవంత్ రెడ్డి అంటాడని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు హ‌రీశ్ రావు. మహిళలకు రూ. 2500 రావాలన్నా, వృద్ధులకు రూ. 4000 పెన్షన్ రావాలన్నా జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొట్టి తీరాల‌ని, సీఎంకు, కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాల‌న్నారు. ఓటుతో రేవంత్ రెడ్డి చెంపలు వాయించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *