రౌడీ షీట‌ర్ న‌ని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Spread the love

స‌వాల్ విసిరిన కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్

హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ శాస‌న స‌భ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన నవీన్ యాద‌వ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌పై ప‌దే ప‌దే బీఆర్ఎస్ నేత‌లు రౌడీ షీట‌ర్ అంటూ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ద‌మ్ముంటే తాను రౌడీ షీట‌ర్ న‌ని నిరూపించాల‌ని లేక పోతే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్ పై. ఖ‌లేజా ఉంటే నిరూపించగ‌ల‌వా అని మండిప‌డ్డారు. తన మీద ఒక్క రౌడీ షీట్ కేసు అయినా నమోదు అయినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానంటూ సవాల్ విసిరారు. ఆయ‌న హైద‌రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.

తనను రౌడీ షీటర్ అంటూ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఆరోపించారు. నిరూపిస్తే రాజకీయాలు వదిలేయడమే కాదు, హైదరాబాదే వదిలి వెళతానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు నవీన్ యాద‌వ్. ఇదిలా ఉండ‌గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ కొన‌సాగుతోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ వ‌ర్స‌స్ బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్యే ఉంది. ఇరు పార్టీలు ఇప్ప‌టికే స్టార్ క్యాంపెయిన‌ర్ల‌ను ప్ర‌క‌టించాయి. ఇందులో భాగంగా ప్ర‌చారాన్ని హోరెత్తించాయి. ఎవ‌రికి వారే గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మ‌రో వైపు క్లాస్ తో పాటు మాస్ కూడా ఇక్క‌డ అత్య‌ధికంగా ఓట‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. దీంతో వీరి ఓట్లు అభ్య‌ర్థుల గెలుపును నిర్దేశించ‌నున్నాయి.

  • Related Posts

    జ‌గ‌న్ చేసిన దుర్మార్గాల‌ను స‌రిచేస్తున్నాం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నంద్యాల జిల్లా డోన్ లో ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల పంపిణీ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా…

    చంద్రబాబును విమర్శించే అర్హత జ‌గ‌న్ కు లేదు

    Spread the love

    Spread the loveరాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *