ప్రజల కోసం గొంతు వినిపిస్తా
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
మణిపూర్ – దేశ ప్రజల కోసం తాను భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టానని స్పష్టం చేశారు వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన మణిపూర్ రాష్ట్రం నుంచి రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాల్టితో రెండో రోజుకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు ఆయన వెంట నడుస్తున్నారు. అడుగడుగునా రాహుల్ గాంధీక జనం బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ సందర్బంగా రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మోదీ కొలువు తీరాక ఈ దేశంలో వ్యాపారవేత్తలు , కార్పొరేటర్ కంపెనీలు మాత్రమే లాభ పడ్డాయని పేదలు, సామాన్యులు అలాగే ఉండి పోయారని ఆరోపించారు.
తనను ప్రజల తరపున మాట్లాడేందుకు లేకుండా చేయాలని తన ఎంపీ స్థానంపై వేటు వేశారని మండిపడ్డారు. చట్ట సభల్లోకి రాక పోయినా తాను ప్రజల మధ్యనే ఉంటానని వారి గొంతుకనై వినిపిస్తూనే ఉంటానని హెచ్చరించారు. ప్రజలు స్వచ్చందంగా తమ యాత్రకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర 67 రోజుల పాటు కొనసాగుతుంది. బస్సు లోనే కాకుండా కాలి నడకన కూడా యాత్ర చేపడతారు రాహుల్ గాంధీ. 6,713 కిలోమీటర్ల మేర సాగుతుంది.
ఈ యాత్రలో 110 జిల్లాలు , 100 లోక్ సభ స్థానాలు, 377 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తుందని పార్టీ తెలిపింది. ఈ యాత్ర ముంబై లో మార్చి 20 లేదా 21న ముగుస్తుంది.