పంట‌ల ప‌రిశీల‌న రైతుల‌కు భ‌రోసా

అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో డిప్యూటీ సీఎం
అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగారు. ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు పంచాయ‌తీరాజ్ , ఇత‌ర శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. గురువారం స్వ‌యంగా తానే రంగంలోకి దిగారు. మొంథా తుపాను దెబ్బ‌కు ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగు చేసుకున్న‌, చేతికి వ‌చ్చిన పంట‌లు నీటి పాలయ్యాయి. దాదాపు 87 వేల‌కు పైగా హెక్టార్ల‌లో పంట న‌ష్టం వాటిల్లిన‌ట్లు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశారు ఉన్న‌తాధికారులు. ఇదే విష‌యాన్ని సీఎస్ కు, సీఎం చంద్ర‌బాబు నాయుడుకు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు తెలియ చేశారు. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు . ఈ సంద‌ర్బంగా రైతుల‌తో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

ప్ర‌భుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని హామీ ఇచ్చారు. ఏ ఒక్క‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌కు త‌మ స‌ర్కార్ అండ‌గా ఉంటుంద‌న్నారు. ఈ మేర‌కు న‌ష్ట ప‌రిహారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. తుపాను ప్ర‌భావం కార‌ణంగా పెద్ద ఎత్తున న‌ష్టం వాటిల్లింద‌న్నారు. భారీ ఎత్తున రోడ్లు కూడా పాడై పోయాయ‌ని వాపోయారు ప‌వ‌న్ కళ్యాణ్. పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు ప‌ని చేస్తున్నాయ‌న్నారు. రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్ క్లోరినేషన్, సూపర్ శానిటేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *