రేపే సీఎం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే

వ‌రంగ‌ల్, హుస్నాబాద్ కు వెళ్ల‌నున్నారు

హైద‌రాబాద్ : మొంథా తుపాను ప్ర‌భావం దెబ్బ‌కు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప్ర‌ధానంగా ప‌లు చోట్లు వాగులు, వంక‌లు, న‌దులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున ర‌హ‌దారులు కూడా పాడ‌య్యాయి. చేతికి వ‌చ్చిన పంట‌లు ఎండి పోయాయి. ఇదిలా ఉండ‌గా గురువారం సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష చేప‌ట్టారు. ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఆరా తీశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశించారు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించామ‌న్నారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండ‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది స‌ర్కార్.

తుపాను కార‌ణంగా తీవ్రంగా దెబ్బ‌తిన్న వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల‌లో శుక్ర‌వారం స్వ‌యంగా ఈసెం రేవంత్ రెడ్డి ఏరియ‌ల్ స‌ర్వే చేప‌డ‌తార‌ని తెలిపింది. ఆయ‌న తో పాటు నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, ఇత‌ర మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో పాటు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కూడా ప‌ర్య‌టిస్తార‌ని పేర్కొంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయనున్నారు. ఇదిలా ఉండ‌గా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇంచార్జి మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

  • Related Posts

    జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

    పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు.…

    హెచ్‌ఐఎల్‌టీపీ స్కీం కాదు అది స్కాం

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన కేటీఆర్ హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్ర‌వారం ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *