దామోదర ఫేస్ బుక్ పేజీ హ్యాక్
స్పందించ వద్దని కోరిన మంత్రి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు బిగ్ షాక్ తగిలింది. ఊహించని రీతిలో ఆయనకు చెందిన వ్యక్తిగత సోషల్ మీడియా ఫేస్ బుక్ పేజీని ఎవరో హ్యాక్ చేశారు. రకరకాల పోస్టులు పెడుతూ వస్తున్నారు. దీంతో విషయం తెలుసుకున్న దామోదర రాజ నరసింహ ఆశ్చర్యానికి లోనయ్యారు. ముందస్తుగా మేలుకున్న మంత్రి తన అనుచరులకు వెంటనే నిలిపి వేయాలని సూచించారు.
ఫేస్ బుక్ పేజీ నుంచి చిత్ర విచిత్రంగా కూడా పోస్టులు పెడుతుండడంతో దానికి రిప్లై ఇవ్వలేక నానా తంటాలు పడుతున్నారు. బీజేపీ, టీడీపీ, తమిళనాడు రాజకీయ పార్టీలకు చెందిన వందల సంఖ్యలో పోస్టులు పెడుతున్నారు. ఈ కేటుగాళ్ల పోస్టులకు లబోదిబోమంటున్నారు దామోదర రాజ నరసింహ అనుచరులు.
ఈ సందర్బంగా మంత్రి తన అనుచరులు, అభిమానులు, నేతలు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. తప్పుడు మెసేజ్ లకు స్పందించవద్దని కోరారు. ఇదిలా ఉండగా ఈ మధ్యన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు చెందిన సోషల్ మీడియాలోని ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్ పేజీలను హ్యాక్ చేస్తుండడంతో ఆందోళనకు గురవుతున్నారు.