సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం అందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సమక్షంలో బీజేపీకి చెందిన పలువురు చేరారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు, సీఎం ఇష్టానుసారం హామీలు ఇచ్చారని, చెవుళ్లో పూలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు. చివరకు దేవుళ్లను సైతం విడిచి పెట్టలేదని, వారిపై కూడా ఒట్టేశారని, జనానికి టోపీ పెట్టారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రెండేళ్ల ప్రభుత్వంలో ఎవరికైనా, ఏ రంగానికైనా మేలు చేకూరిందా అని ప్రశ్నించారు. మహిళలకు రూ. 4000, యువతులకు రూ. 2500, తులం బంగారం అంటూ నోటికొచ్చిన హామీలు ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డిని నిలదీస్తే నన్నెవరు నమ్మట్లేదు అంటున్నారని పేర్కొన్నారు కేటీఆర్. ఢిల్లీకి పోతే దొంగలా చూస్తున్నారని అంటున్నారని, మరి దొంగను దొంగలాగానే కదా చూస్తారని అన్నారు. ఇంటికి పెద్దలాంటి నాయకుడే ఇలా మాట్లాడితే ఇంకెవరు నమ్ము తారంటూ ప్రశ్నించారు. అప్పు తీసుకుంటే కూడా నిబద్ధతతో పని చేయాలన్నారు. వంద రోజుల్లో ఇస్తానన్న హామీలు ఏడు వందల రోజులైనా కాంగ్రెస్ నెరవేర్చట్లేదని మండిపడ్డారు. వృద్ధులు, నిరుద్యోగులు, మహిళలు, యువతులు అందరూ హామీల గురించి అడుగుతున్నారని పేర్కొన్నారు. చేతకాకపోతే అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చినా.. నాతో కావట్లేదని రేవంత్ రెడ్డి పక్కకు కూర్చోవాలని హితవు పలికారు.






