సీసీటీవీ ఫుటేజ్ లు, కీలకమైన పత్రాలు సేకరణ
చెన్నై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటన . టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు దళపతి విజయ్ చేపట్టిన ర్యాలీలో ఊపిరి ఆడక ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విచారణకు ఆదేశించింది తమిళనాడు డీఎంకే ప్రభుత్వం. ఇదే సమయంలో మద్రాస్ హైకోర్టు సీరియస్ అయ్యింది ఈ అంశంపై దాఖలు అయిన కేసు విచారణ సందర్బంగా. ఈ మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేయాలని, నిబద్దత కలిగిన పోలీస్ ఆఫీసర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇదే సమయంలో సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ప్రకటన చేశారు. రిటైర్డ్ జడ్జిని విచారణ నిమత్తం నియమించినట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ చేపట్టిన ర్యాలీ, ప్రచారం ఉన్నట్టుండి ఆగి పోయింది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. పూర్తిగా బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించారంటూ వ్యాఖ్యానించింది.
ఇదే క్రమంలో డీఎంకేతో పాటు బీజేపీ, అన్నాడీఎంకే నేతలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు టీవీకే విజయ్. ఇదే సమయంలో తమ తప్పేమీ లేదని, కావాలని దీని వెనుక ఏదో కుట్ర దాగి ఉందంటూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర దర్యాప్తు సంస్త సీబీఐని విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం చెన్నై లోని టీవీకే ప్రధాన కార్యాలయానికి
విచారణ బృందం చేరుకుంది. ఈ సందర్బంగా కరూర్ ఘటనకు సంబంధించి సీసీ టీవీ ఫుటేజ్ లతో పాటు కీలకమైన పత్రాలను పరిశీలించింది. కొన్నింటిని తమకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.






