క‌పిల్ ను మించిన దేశ భ‌క్తుడు ఎవ‌రు ..?

ఈ దేశంలో క్రికెట్ ఒక మ‌తంలా పాకేలా చేసిన వాడు, కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుకున్న ఒకే ఒక్క‌డు ..ఎవ‌రు అవున‌న్నా కాద‌న్నా క‌పిల్ దేవ్ మాత్ర‌మేన‌ని చెప్ప‌క త‌ప‌ప‌దు. ఈ హ‌ర్యానా హ‌రికేన్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆయ‌న ఏనాడూ ఏ పార్టీకి కొమ్ము కాయ‌లేదు. త‌ను ఏది అనుకుంటాడో అదే చెబుతాడు. అంతెందుకు మ‌హిళా రెజ్ల‌ర్లు తాము లైంగిక వేధింపుల‌కు గుర‌వుతున్నామ‌ని ఆవేద‌న చెందుతూ క‌న్నీటి ప‌ర్యంతం అయితే ఏ ఒక్క క్రికెట‌ర్ ముందుకు రాలేదు మాట్లాడేందుకు. కానీ క‌పిల్ దేవ్ వారి ప‌క్షాన నిల‌బ‌డ్డాడు. వారిని ప‌రామ‌ర్శించాడు. వారికి త‌న వంతుగా మ‌ద్ద‌తు తెలిపాడు. ఇది క‌దా స్పోర్ట్స్ మెన్ కు ఉన్న నిజాయితీ అంటే. ప్ర‌పంచంలో క్రికెట్ ఉన్నంత కాలం , భార‌త దేశంలో క్రికెట్ శాసిస్తున్నంత కాలం క‌పిల్ దేవ్ గురించి ప్ర‌స్తావించ‌కుండా ఉండ‌లేం. ఎందుకంటే అత‌డు సామాన్యుడు కాదు అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగిన యోధుడు.

ఓట‌మిని ఏనాడూ ఒప్పుకోని ధీరుడు. క‌ళ్లు చెదిరే బంతుల‌తో , మిస్సైల్స్ కంటే వేగంగా విసురుతూ ప్ర‌త్య‌ర్థుల గుండెల్లో వ‌ణుకు పుట్టించిన వాడు. 1983లో తొలిసారిగా భార‌త దేశానికి క్రికెట్ ప‌రంగా ప్ర‌పంచ క‌ప్ ను తీసుకు వ‌చ్చిన వాడు. త‌న జ‌ట్టులో ఉన్న రోజ‌ర్ బిన్నీ ఇప్పుడు బీసీసీఐ చీఫ్ గా ఉన్నాడు. కానీ ఏనాడూ బంతిని, బ్యాట్ ను ప‌ట్టుకోని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా త‌న‌యుడు జే షా ఇప్పుడు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)ని శాసిస్తున్నాడు. అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. విచిత్రం ఏమిటంటే 2011లో భార‌త్ కు వ‌ర‌ల్డ్ క‌ప్ తీసుకు వ‌చ్చిన మ‌హేంద్ర సింగ్ ధోనీని కూడా విస్మ‌రించ‌డం విస్తు పోయేలా చేసింది స్వ‌ర్ణోత్స‌వాల సంద‌ర్బంగా. క్రికెట్ అంటే స‌చిన్ టెండూల్క‌ర్ అనుకుంటే ఎలా. బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీని కూడా పిల‌వ‌లేదు. అంతెందుకు భార‌త జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు స‌మ‌కూర్చి పెట్టిన మ‌ణిక‌ట్టు మాంత్రికుడు మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ను కూడా కావాల‌ని విస్మ‌రించారు.

సినిమా తార‌ల‌ను, త‌మ‌కు అనుకూలంగా ఉన్న వారిని మాత్ర‌మే నెత్తిన పెట్టుకుంది బీసీసీఐ. చివ‌ర‌కు భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల ఫైన‌ల్ మ్యాచ్ కు త‌న‌ను ఆహ్వానించ లేద‌ని సాక్షాత్తు క‌పిల్ దేవ్ వాపోయాడు. ఒక ర‌కంగా ఆయ‌న ఆవేద‌న‌లో అర్థం ఉంది. ఎందుకంటే త‌ను నిజ‌మైన క్రికెట‌రే కాదు గొప్ప దేశ భ‌క్తుడు కూడా. త‌న‌పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు మీడియా సాక్షిగా క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దేశం కోసం తాను చ‌చ్చేందుకు సైతం సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించాడు. ఎలాంటి భేష‌జాలు లేకుండా , ప్ర‌చారానికి దూరంగా ఉంటూ సింప్లిసిటీని ఇష్ట‌ప‌డే క‌పిల్ దేవ్ ను బీసీసీఐ ప్ర‌త్యేకించి జేషా అవ‌మానించి ఉండ‌వ‌చ్చు. కానీ కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెల్లో అత‌డి స్థానాన్ని, ఆయ‌న‌పై ఉన్న ప్రేమ‌ను మాత్రం చెర‌ప‌లేరు. క్రికెట్ జ‌నాద‌ర‌ణ పొంద‌డంలో దేశాన్ని చుట్టుముట్టడంలో క‌పిల్ దేవ్ పోషించిన పాత్ర విస్మ‌రించ లేనిది. ఇది ముమ్మాటికీ నిజం.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *