రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి

Spread the love

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

అమ‌రావ‌తి : రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన్నామ‌ని, దీనిని కూడా వైసీపీ రాజ‌కీయం చేయాల‌ని ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. జిల్లాలో ఏమి జరుగుతోందో చూడకుండా మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఆయ‌న స్థాయికి త‌గ‌ద‌న్నారు. అయినా వైసీపీ పార్టీ బాస్ కు నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం త‌ప్పితే త‌న‌కు ఏమీ రాద‌న్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఉల్లి రైతులు నష్టపోకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచించి హెక్టార్ కి 50,000 చొప్పున అంద చేయాలని నిర్ణయించడం జ‌రిగింద‌ని చెప్పారు. 104 కోట్ల 57లక్షల రూపాయలు ఉల్లి రైతులకు లబ్ధి చేకూర్చామ‌న్నారు.

ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టినప్పుడు క్వింటాకు రూ.1200/- వెచ్చించి మార్కెటింగ్, మార్క్-ఫెడ్ ద్వారా కర్నూలు మార్కెట్ లో సుమారు 17 కోట్ల 22 లక్షల రూపాయల విలువ గల ఉల్లి పంటను కొనుగోలు చేశామ‌ని చెప్పారు కింజరాపు అచ్చెన్నాయుడు. పంట పాడవ్వకుండా రైతులకు మేలు చేశామ‌న్నారు. 2020లో వైసీపీ హయాంలో ఉల్లి ధర పడిపోతే మద్దతు ధర 770 రూపాయలు ప్రకటించడం తప్ప చేసిందేమి లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ ద్వారా కేవలం 129 మంది రైతుల నుంచి 970 మెట్రిక్ టన్నుల ఉల్లిని మాత్రమే సేకరించి, రైతులకు కేవలం 75 లక్షలు మాత్రమే చెల్లించిన విషయం అవినాష్ రెడ్డి గుర్తించు కోవాల‌న్నారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *