నవ రత్నాలు పేదలకు ఇళ్లు
లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్
అమరావతి – తాము ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ అమలు చేయడం జరిగిందన్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. నవ రత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. లబ్దిదారులకు గురువారం వడ్డీ రీయింబర్స్ మెంట్ డబ్బులను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా జగన్ రెడ్డి మాట్లాడారు. గతంలో ఇల్లు కావాలంటే ఇబ్బంది ఉండేదని, కానీ ఇవాళ ఎవరికి లొంగి ఉండకుండా ఉండేలా గౌరవ ప్రదంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులకు పూర్తి భరోసా ప్రభుత్వమే కల్పిస్తోందని పేర్కొన్నారు సీఎం.
కాలనీలు, గ్రామాలు ఏర్పడాలంటే కనీసం వందేళ్లు పడుతుందని కానీ తాము పవర్ లోకి వచ్చాక ఆచరణలో చేసి చూపించానని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం రెండున్నర ఏళ్లలలో 17 వేల జగనన్న కాలనీలు నిర్మించడం జరిగిందని చెప్పారు మంత్రి జోగి రమేష్. ఇదంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందని తెలిపారు.
31 లక్షల మంది అక్కా చెల్లెళ్లలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. 22 లక్షల ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు జోగి రమేష్.