22న హాఫ్ హాలిడే ప్రకటన
కేంద్రం సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనవరి 22న యూపీలోని అయోధ్య రామ మందిరం ఆలయ పునః ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి పోయింది యూపీ సర్కార్. సీఎం యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో కనీవిని ఎరుగని రీతిలో కొనసాగుతున్నాయి కార్యక్రమాలు.
ఇప్పటికే రామ మందిరం ట్రస్టు 7,000 మంది ప్రముఖులకు రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాల్సిందిగా విశిష్ట ఆహ్వానాలు అందజేసింది. ఇందులో సినీ రంగానికి చెందిన నటీ నటులు, ఇతర సాంకేతిక నిపుణులు ఉన్నారు. వారితో పాటు క్రికెటర్లు, ఇతర క్రీడా రంగాలకు చెందిన సీనియర్ క్రీడాకారులకు కూడా ఇన్విటేషన్లు పంపిణీ చేసింది.
మరో వైపు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా జనవరి 22న అన్ని కోర్టులకు సెలవు ప్రకటించాలని కోరింది. ఈ మేరకు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ చంద్రచూడ్ కు లేఖ రాసింది. ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు.
ఇదిలా ఉండగా ఆరోజు దేశానికి ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు ప్రధానమంత్రి మోదీ. ఆఫ్ హాలిడే ను ప్రకటించింది కేంద్ర సర్కార్. ఉద్యోగులంతా ధన్యవాదాలు తెలిపారు పీఎంకు.