NEWSTELANGANA

ఈడీ ఎదుట విచార‌ణ‌కు వివేక్

Share it with your family & friends

హ‌వాలా..ఫెమా కేసులో ఎమ్మెల్యే

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ కుమార్ కు బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డ‌బ్బులు అక్రమంగా పంపిణీ చేస్తున్నారంటూ ఆయ‌న‌పై అభియోగాలు న‌మోద‌య్యాయి. డ‌బ్బులు తీసుకు వెళుతుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. దొరికిన వారిని విచారిస్తే అనూహ్యంగా ఈ డ‌బ్బులు వివేక్ కు చెందిన‌విగా చెప్ప‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేశారు.

దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై హ‌వాలా, ఫెమా కేసులు న‌మోద‌య్యాయి. గురువారం ఈ మేర‌కు కేసుకు సంబంధించి గ‌డ్డం వినోద్ కుమార్ కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు హాజ‌ర‌య్యారు. ప్రైవేట్ సెక్యూరిఈ సంస్థ‌లో పెద్ద ఎత్తున డిపాజిట్ల‌పై కేసు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

ఎన్నిక‌ల ముందు జ‌రిగిన వ్య‌వ‌హారంలో కేసు న‌మోదు చేశారు సిటీకి చెందిన పోలీసులు. విశాఖ ఇండ‌స్ట్రీ నుంచి సెక్యూరిటీ సంస్థ‌లో రూ. 8 కోట్ల కు పైగా డిపాజిట్ చేశారు. నిధుల డిపాజిట్ కావ‌డంపై ఈడీ ఆరా తీసింది. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు ఎమ్మెల్యే గ‌డ్డం వినోద్ కుమార్.

తాము ఎప్ప‌టి లాగే కంపెనీ ప‌రంగా ప‌న్నులు క‌డుతూ వ‌స్తున్నామ‌ని చెప్పారు. ఇప్ప‌టికే స్వ‌చ్చందంగా ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను కూడా చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.