కెప్టెన్ మిల్లర్ కలెక్షన్ కిల్లర్
వసూళ్ల వేటలో ధనుష్ మూవీ
తమిళ సినీ రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగిన నటుడు ధనుష్. వై దిస్ కొలవరీ అంటూ తన గానంతో ఉర్రూత లూగించిన ఆయన ఇవాళ అన్ని పాత్రల్లో ఒదిగి పోయేలా తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. తాజాగా తను నటించిన కెప్టెన్ మిల్లర్ విడుదలైన ప్రతి చోటా బాక్సులు బద్దలు కొడుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చి దిద్దాడు ఈ సినిమాను దర్శకుడు.
వరల్డ్ వైడ్ గా ఏకంగా రూ.81 కోట్లకు పైగా వసూలు సాధించింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు వసూలు చేస్తుందో చెప్పలేమంటున్నారు సినీ క్రిటిక్స్. ధనుష్ అద్బుతంగా నటించాడు. ఆయన నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
ఇక సినిమా వసూళ్ల విషయానికి వస్తే తొలి రోజు రూ. 16.29 కోట్లు, 2వ రోజు రూ. 14.18 కోట్లు, 3వ రోజు రూ. 15.65 కోట్లు, 4వ రోజు రూ. 13.51 కోట్లు, 5వ రోజు రూ. 12.24 కోట్లు, 6వ రోజు రూ. 9.33 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి వరకు కెప్టెన్ మిల్లర్ రూ. 81.20 కోట్లు వసూలు చేసింది. ట్రేడ్ పండితులను సైతం విస్తు పోయేలా చేయడంతో సినిమా టీం తెగ సంతోషానికి లోనవుతోంది.