మాజీ ఎంపీ వినోద్ కుమార్ కామెంట్స్
హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆరోపించారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.
బీఆర్ఎస్‌కు ఓటేస్తే జూబ్లీహిల్స్‌కు రానని మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ చెప్పడం న్నికల కోడ్ కిందకు రాదా అని ప్రశ్నించారు. మీరు ఓటు వేయక పోతే సంక్షేమ పథకాలు నిలిపి వేస్తానంటూ బహిరంగంగానే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ . కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రచారం ఎలా చేస్తారో చూస్తా అని బెదిరించడం కోడ్ ఉల్లంఘన కాదా అని , ఇది ఈసీకి , అధికారులకు కనిపించడం లేదా అని మండిపడ్డారు . ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఈసీ కావాలని వివక్ష చూపిస్తోందని ఆరోపించారు.
ఇదే అంశంపై ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు బోయనపల్లి వినోద్ కుమార్. ఇక్కడి ఎన్నికల ప్రధానాధికారికి ప్రతిరోజూ తమ పార్టకి చెందిన నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవుడు సీఈఓ నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు మాజీ ఎంపీ. సుదర్శన్ రెడ్డి తమ ఫిర్యాదులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు కాంగ్రెస్‌కు కనీసం ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈసీ పక్షపాత వైఖరిపై హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళతామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు భవనానికి 8 లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఎలా లేఖ రాస్తారంటూ ప్రశ్నించారు. తనపై ఈసీ చర్యలు తీసుకోదా అని నిలదీశారు వినోద్ కుమార్.






