ఎన్డీయే తరపున మంత్రి క్యాంపెయిన్
అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బీహార్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇప్పటికే సుడిగాలి పర్యటనలు చేశారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇందులో భాగంగా కేంద్రంలో కొలువు తీరిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు చెందిన ప్రధాన నేతలంతా బీహార్ బాట పట్టారు. మరో వైపు మహా కూటమి కూడా ఇక్కడ గట్టి పోటీ ఇస్తోంది. ప్రధానంగా రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్ లు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
ఇప్పటికే తొలి విడత పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ప్రధాని మోదీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆయనే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. మరో వైపు ఏపీ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఐటీ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం సందర్బంగా బీహార్ లోని పాట్నా లో ఎన్డీయే సంకీర్ణం తరపున బరిలో నిలిచిన అభ్యర్థుల తరపున క్యాంపెయిన్ చేపడతారు.






