ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై స‌మీక్ష‌

మ‌రింత అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి

తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, లోపల, బయట క్యూలైన్లలోని సీసీ కెమెరాలను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో అనుసంధానం చేయాలని ఆదేశించారు.

విజిలెన్స్, వైకుంఠం, ఆలయ సిబ్బంది క్యూలైన్ లో భక్తుల సంఖ్య, కదలికలపై గణాంకాలను ఎప్పటికప్పుడు విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఐటీ విభాగానికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. కార్య ఫౌండేషన్ USA ఇప్పుడున్న సాప్ట్ వేర్ ను రివ్యూ చేసి మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకు ఆ సంస్థకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు వైకుంఠం, విజిలెన్స్ సిబ్బంది అందించాలని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై ప్రతివారం సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఐటీ జీఎం ఫణి కుమార్ నాయుడు, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీవోలు రామ్ కుమార్, సురేంద్ర, DGM (IT) వెంకటేశ్వర నాయుడు , కార్య ఫౌండేషన్ సంస్థ ప్రతినిధులు జయ ప్రసాద్, రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

  • Related Posts

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    స‌త్య‌సాయి బాబా జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    స్ప‌ష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమ‌రావ‌తి : ఈ భూమి మీద పుట్టిన అద్భుత‌మైన వ్య‌క్తి భ‌గ‌వాన్ శ్రీ స‌త్య సాయి బాబా అన్నారు మంత్రి కందుల దుర్గేష్. సేవకు పర్యాయపదం, ప్రతిరూపం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *