రాను ముంబైకి రాను నెట్టింట్లో హ‌ల్ చ‌ల్

ఓ వైపు సినిమాల తాకిడి ఇంకో వైపు మ్యూజిక్ ఆల్బంలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌స్తూనే ఉన్నాయి. గ్రాండ్ గా రిలీజ్ అవుతున్నాయి. కానీ అంద‌రినీ తోసిరాజ‌ని ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది తెలంగాణ జాన‌ప‌ద గీతం. అంతే కాదు సామాజిక మాధ్య‌మాల‌లో అదే ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. ఇక రీల్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇంత‌కీ ఏమిటా పాట అనుకుంటున్నారా..అదే రాను ముంబైకి రాను అనే గీతం. ఇప్పుడు కుర్ర కారునే కాదు యువ‌తీ యువ‌కుల‌ను, చిన్నారుల‌ను, పెద్దోళ్ల‌ను అంద‌రినీ కిర్రాక్ తెప్పించేలా చేస్తోంది.

ఇంత‌కీ ఈ పాట‌ను రాయ‌డ‌మే కాదు పాడి, డ్యాన్సు కూడా చేశాడు, అంద‌రినీ మైమ‌రిచి పోయేలా చేశాడు ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన రాము రాథోడ్. త‌ను డ్యాన్స‌ర్ కూడా. అద్భుత‌మైన గాత్రం అత‌డి సొంతం. జాన‌ప‌ద క‌ళాకారుల‌ను చూసి త‌ను కూడా పాడ‌డం మొద‌లు పెట్టాడు. ఆ త‌ర్వాత ఎందుకు రాయ కూడ‌దంటూ ఏకంగా పాట‌లు రాసుడు షురూ చేశాడు. ఇంకేం త‌ను రాసి , పాడి, న‌టించిన రాను ముంబైకి రాను అంటూ ప్రేమికురాలిని ప్రేమ‌తో బ‌తిమిలాడు కోవ‌డం, త‌ను రాన‌ని, న‌గ‌రం అంటే ఇష్టం లేద‌ని, తానున్న చోటే బాగుందంటూ ల‌వ‌ర్ చెప్ప‌డం ఈ పాట నేప‌థ్యం.

ఇప్పుడు ఈ సాంగ్ ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. అన్ని చోట్లా వైర‌ల్ గా మారింది. దీంతో ఒక్క‌సారిగా రాము రాథోడ్ స్టార్ సింగ‌ర్ గా మారి పోయాడు. ఇక త‌న‌తో పోటీ ప‌డి న‌టించింది ఇంట‌ర్ చ‌దువుతున్న లిఖిత‌. వీరిద్ద‌రి డ్యాన్స్ కెవ్వు కేక అనిపించేలా సాగింది. మిలియ‌న్ల వ్యూస్ ను దాటేసింది ఈ సాంగ్. దీనిని శ్రీ‌వ‌ల్లి చైత‌న్య నిర్మించ‌గా రాము రాథోడ్ రాశాడు. త‌న‌తో పాటు ప్ర‌భ ఈ పాట‌ను పాడింది. క‌ళ్యాణ్ కీస్ సంగీతం అందించాడు. శేఖ‌ర్ వైర‌స్ కొరియోగ్ర‌ఫీ చేశాడు. అజ‌య్ రంగు ఎడిటింగ్ చేశాడు.

  • Related Posts

    సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డ్డాం : నాగార్జున‌

    ఉచిత సినిమాల‌ను చూస్తే డేటా చోరీ హైద‌రాబాద్ : ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కుటుంబం కూడా సైబ‌ర్ చీట‌ర్స్ బారిన ప‌డింద‌న్నాడు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో…

    అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం వాడాడు

    ఐబొమ్మ ర‌విపై సీపీ స‌జ్జ‌నార్ షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : ఐ బొమ్మ ఫౌండ‌ర్ ఇమ్మ‌డి ర‌వి కొట్టిన దెబ్బ‌కు టాలీవుడ్ విల విల లాడింది. ఈ సంద‌ర్బంగా క‌రేబియ‌న్ దీవుల‌లో ఉంటూ ఈ వెబ్ సైట్ ద్వారా వేలాది సినిమాల‌ను…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *