స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
బెంగళూరు : కర్ణాటక పీసీసీ చీఫ్ పదవికి తాను రాజీనామా చేయడం, తాను పార్టీ నుంచి వీడుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తాను ముందు నుంచీ పార్టీకి విధేయుడిగా ఉన్నానని, ఎల్లప్పటికీ ఉంటానని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను , సీఎం సిద్దరామయ్య పార్టీ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రాజకీయాల నుంచి కాకుండా పార్టీకే గుడ్ బై చెప్పి కొత్త కుంపటి ఏర్పాటు చేస్తారంటూ డీకే శివకుమార్ పై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఢిల్లీ వేదికగా చర్చలు కొనసాగుతున్నాయి. ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దీనికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం.
ఇతర పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలోనే స్వేచ్ఛ ఎక్కువ. ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ హై కమాండ్ ను కలుస్తుంటారు. వద్దని చెప్పే హక్కు తనకు లేదన్నారు డీకే శివకుమార్. వారు విందు ఏర్పాటు చేసుకున్నారు. కొత్త పీసీసీ చీఫ్ ను ఎన్నుకోవాలని అనుకున్నారు. నలుగురు లేదా ఐదు మంది డిప్యూటీ సీఎంలను నియమించాలని ముందు నుంచి కోరుతున్నారని అది వారి హక్కు అని కాదనే స్వేచ్ఛ తనకు లేదన్నారు డీకే శివకుమార్. కర్ణాటకలో అధికార పార్టీలో చెలరేగిన వివాదానికి తెరదించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కూడగట్టానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమన్నారు.





