స‌న్న బియ్యం పంపిణీ ప్ర‌శంస‌నీయం : జోషి

తెలంగాణ స‌ర్కార్ కు కేంద్ర మంత్రి కితాబు

హైద‌రాబాద్ : దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద‌ల‌కు స‌న్న బియ్యం పంపిణీ చేయ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి . ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం ఎ. రేవంత్ రెడ్డిని, పౌర స‌ర‌ఫ‌రాలు, నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డిల‌ను అభినందించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామ‌ని కేంద్ర మంత్రికి తెలియ చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. దేశ వ్యాప్తంగా పేద‌ల‌కు ఆయా రాష్ట్రాల‌లో ఇదే ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, ఈ సంద‌ర్భంగా ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడాల‌ని కోరారు.

ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కీల‌క‌మైన సూచ‌న‌కు సానుకూలంగా స్పందించారు కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషి. మంచి ప‌థ‌క‌మ‌ని, దీని వ‌ల్ల పేద‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. త్వ‌ర‌లోనే తాను ముఖ్య‌మంత్రుల‌తో మాట్లాడుతాన‌ని, ఢిల్లీలో ఇందుకు సంబంధించి కీల‌క స‌మావేశం నిర్వ‌హిస్తాన‌ని చెప్పారు. ఇందుకు సంబంధించి సాధ్యా సాధ్యాల‌ను కూడా ప‌రిశీలిస్తామ‌ని పేర్కొన్నారు. మ‌రో వైపు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *