కార్మికుల‌కు ద్రోహం చేసిన కాంగ్రెస్ స‌ర్కార్

నిప్పులు చెరిగిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కార్మికులకు ద్రోహం చేసే నైజాన్ని మరోసారి బయటపెట్టుకుందంటూ మండిప‌డ్డారు. హైద‌రాబాద్ లో క‌ల్వ‌కుంట్ల క‌విత మీడియాతో మాట్లాడారు. మొత్తం 129 మంది తాము రిటైర్ అయి తమ పిల్లలు, కావాల్సిన వారికి ఉద్యోగం ఇప్పించాలనుకున్న కార్మికుల ఆశల పై ప్ర‌భుత్వం నీళ్లు చ‌ల్లిందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెడికల్ అన్ ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికే ఆమోదం తెలిపిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. కార్మికులంతా కోరుకున్న‌ట్లు ప్ర‌తి ఒక్క‌రికీ న్యాయం చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

లేక‌పోతే ప్ర‌జా పోరాటాల ద్వారా బుద్ది చెప్పి తీరుతామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో బీసీల‌ను న‌ట్టేట ముంచింద‌న్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి మోసం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చాడ‌ని మండిప‌డ్డారు. బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత మాత్రం దానికి రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి, కులగణన సర్వే చేసి, రాహుల్ రేవంత్ మోడల్ అని బిల్డప్ కొట్టడం దేనికి అంటూ ప్ర‌శ్నించారు. ఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెపుతార‌ని అన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *