గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

ఆదేశించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క సూచ‌న‌లు చేశారు. వచ్చే నెల డిసెంబ‌ర్ లో 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ – 2025” ను ఘనంగా నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల పై పలు శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సూచించారు. దేశ విదేశాల నుండి సమ్మిట్ కు వస్తున్న ఆహ్వానితులకు సంబంధించి వ‌స‌తి సౌక‌ర్యాలు, బస, ఇతర ఏర్పాట్ల విషయంలో ఎక్కడా లోటు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి.

సమ్మిట్ లో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకునే విషయంలో ముందుగానే క్రమబద్ధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు సీఎం. ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాలను పంపినట్టు
అధికారులు తెలిపారు. సమ్మిట్ లో ఏర్పాటు చేయబోయే స్టాల్స్ కు సంబంధించిన పలు డిజైన్లను ఈ సమీక్షలో పరిశీలించడం జ‌రిగింద‌న్నారు. సమ్మిట్ లో ఒక్కొక్క ఈవెంట్ కు ఒక్కో సీనియర్ IAS అధికారిని బాధ్యుడిగా నియమించాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి. సమ్మిట్ జరిగే రెండు రోజులు తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అన్నారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన అన్ని డిజైన్లను పూర్తి చేయాలని స్ప్టం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *