తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

Spread the love

పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంక‌ర్ గౌడ్

హైద‌రాబాద్ : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెలంగాణ‌లో జ‌నసేన పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు నేమూరీ శంక‌ర్ గౌడ్. హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి 10 జిల్లాల పార్టీ శ్రేణులు, గ్రేటర్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి పది జిల్లాల్లోని ఇన్చార్జిలు, వివిధ పదవులలో ఉన్న నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ లోని నియోజకవర్గ ఇంచార్జిలు, నాయకులు, వీర మహిళలు, జన సైనికులు హాజ‌ర‌య్యారు.
ఈ సంద‌ర్బంగా పార్టీ బ‌లోపేతంపై నేత‌లు, బాధ్యులు ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని పిలుపునిచ్చారు నేమూరీ శంక‌ర్ గౌడ్. కింది స్థాయి నుంచి ప‌ట్ట‌ణ స్థాయి వ‌ర‌కు జ‌న‌సేన ముందుకు క‌ద‌లాల‌ని అన్నారు.

ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌ని, వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ర్కార్ దృష్టికి తీసుకు వెళ్లాల‌ని సూచించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాదారం రాజలింగం, పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కె సాగర్ , కూకట్పల్లి ఎమ్మెల్యే కంటెస్టెడ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ , బి.విజయ్ , వీర మహిళల విభాగం చైర్మన్ మండపాక కావ్య , వీర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పొన్నూరు శిరీష‌, స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సంపత్ నాయక్, గ్రేటర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డ పాల్గొన్నారు.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *