బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాలి

పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు

హైద‌రాబాద్ : సంస్థాగ‌తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు రాం చంద‌ర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సంఘటనాత్మక కార్యశాల ప్రారంభమైంది. ఈ కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ప్ర‌సంగించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణ, సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టవలసిన కార్యాచరణ గురించి బిజెపి జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్ర‌కాశ్ దిశా నిర్దేశం చేశారు.

జాతీయ సంస్థాగ‌త ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బీఎల్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టికే బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతంగా ఉంద‌ని, కానీ మ‌రికొంత స‌మ‌ర్థ‌వంతంగా కావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. వ్య‌వ‌స్థ‌లో ఎప్పుడైతే బ‌లోపేతం అవుతామో ఇక మ‌న‌కు తిరుగంటూ ఉండ‌ద‌న్నారు బీఎల్ సంతోష్. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, దూష‌ణ‌ల వ‌ల్ల ఎలాంటి లాభం చేకూర‌ద‌న్నారు. కేవ‌లం వ్య‌క్తుల కంటే, పార్టీతో పాటు దేశం కూడా మ‌న‌కు అత్యంత ముఖ్య‌మ‌ని గ్ర‌హించాల‌న్నారు. దేశం కోసం ధ‌ర్మం కోసం మన సందేశం చివ‌రి మాన‌వుడి వ‌ర‌కు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *