పార్లమెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్
ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి.
ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ కోటా లేకపోయినా, రాష్ట్రాలు తమ షెడ్యూల్డ్ కుల, గిరిజన సబ్ ప్లాన్ నిధులను వినియోగించి ఈ వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చని కేంద్ర మంత్రి వివరణ ఇచ్చారు.ఈ సమాధానంపై ఎంపీ గురుమూర్తి స్పందిస్తూ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్దరిస్తూ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్ ప్లాన్ నిధుల నుండి కాకుండా ఈ పథకంలోనే ప్రత్యేకంగా నిర్దిష్ట నిధులు కేటాయించే విధానాన్ని ప్రవేశ పెడితే అనేక మంది పాడి రైతులకు ప్రత్యక్ష లాభం చేకూరుతుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులు పశు సంపద రంగంలో ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రత్యేక జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. పథకం అమలు నిలిచి పోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ లేఖలో వివరించారు. ముఖ్యంగా పశు పోషణపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీ, సన్నకారు రైతులు, మహిళలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పథకం నిలిచి పోవడంతో రైతులు తమ పశువులకు బీమా చేసుకోలేకున్నారని, తత్ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధుల వలన చనిపోయిన పశువుల స్థానంలో, కొత్తవి కొనుగోలు చేయలేక రైతులు నష్ట పోతున్నారని ఎంపీ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో పథకం అమలును వేగవంతం చేసి, రైతులకు సత్వర ప్రయోజనాలు అందేలా చూడాలని ఎంపీ కోరారు.






