అందించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
న్యూఢిల్లీ : ఏపీని ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత వంగలపూడి , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ లతో కలిసి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కలిశారు. ఈ సందర్బంగా మొంథా తుపాను కారణంగా వాటిల్లిన నష్టాన్ని వివరించారు. తక్షణమే నిధులను విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రంలోని 24 జిల్లాల్లోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాను ప్రభావంతో నష్ట పోయాయని తెలిపారు. దీని కారణంగా సుమారు 1.61 లక్షల హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని వివరించారు. సుమారు 6,250 హెక్టార్లలో పండ్ల తోటలు, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వాపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంట నష్టంపై కేంద్రం నుంచి తక్షణమే సాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ సర్కార్ నిర్వాకం కారణంగా దయనీయమైన పరిస్థితిలో ఉందని తెలిపారు.






