
ధర్మస్థల కేసుతో తనకు సంబంధం ఉందంటూ
తమిళనాడు : మైనింగ్ కేసులో జైలుపాలై , చివరకు బెయిల్ పై బయటకు వచ్చిన ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నోరు పారేసు కోవడంపై భగ్గుమన్నారు తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి కాథ్ సెంథిల్ . తనపై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించ బడ్డాయని పేర్కొన్నారు. జనార్దన్ రెడ్డిపై క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ధర్మస్థల కేసుతో తనను ముడి పెట్టినందుకు మండిపడ్డారు. ఇదంతా తనను డ్యామేజ్ చేసేందుకు ఉద్దేశించడం తప్ప మరోటి కాదన్నారు. ఈ మేరకు ఇక్కడి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశానని, ఆ వాదనలను రాజకీయంగా ప్రేరేపించబడినవి, నిర్లక్ష్యంగా ఉన్నాయని తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ శనివారం తెలిపారు.
దక్షిణ కన్నడ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా కూడా గతంలో కర్ణాటకలో ఐఏఎస్ అధికారిగా పని చేసిన అనుభవం ఉంది సెంథిల్ కు. తర్వాత తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంపీగా కూడా గెలిచారు.
కర్ణాటకలో తమిళనాడు రాజకీయాలు ఎక్కడో నెట్టి వేయబడుతున్నాయని తాను భావిస్తున్నానని అన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవమానకరమైన వ్యాఖ్యలకు సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఎఫ్ఐఆర్ ప్రకటన ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సెంథిల్ నొక్కిచెప్పాడు సదరు ఆరోపణలను తోసిపుచ్చాడు.
బిజెపిలో ఉన్న జనార్దన్ రెడ్డి గత నెలలో మొత్తం ధర్మస్థల కేసును సెంథిల్ ద్వారానే నడిపించారని ఆరోపించారు. ప్రజా ప్రయోజనం కోసం, పరువు నష్టంపై నా స్వంత హక్కు కోసం, నేను చట్టబద్ధంగా చర్య తీసుకున్నాను. నా పేరును వాడుకున్న జనార్దన్ రెడ్డిపై నేను క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేసాను. కోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. అతనికి నోటీసు అంద జేయబడుతుంది. నాపై ఏ ప్రాతిపదికన ఆరోపణలు చేశారో ఆయన (రెడ్డి) కోర్టుకు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు సెంథిల్.