బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె తన సోదరుడు , సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు ఓటు వేస్తే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినట్లేనని అన్నారు.
బీజేపీ అంటే బాబు..జగన్ ..పవన్ అని ఎద్దేవా చేశారు షర్మిలా రెడ్డి. బీజేపీ బిల్లు పెడితే ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ పాలన చూద్దామంటే ఎక్కడా కనిపించడం లేదన్నారు. హామీలు ఇవ్వడం మోసం చేయడం తన తండ్రికి అలవాటు లేదన్నారు.
ఇవాళ తనను విమర్శిస్తున్న వాళ్లకు రాజకీయ భిక్ష ఎవరి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచించు కోవాలని సూచించారు. అభివృద్ది మరిచి పోయారని, కేవలం అప్పులు మాత్రమే తెచ్చారంటూ ఆరోపించారు వైఎస్ షర్మిలా రెడ్డి. ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందన్నారు.
ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సైనికుడి లాగా మారాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి ఓటు వేస్తే పోలవరం పూర్తవుతుందని హామీ ఇచ్చారు.