నిప్పులు చెరిగిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ నిర్వాకంపై నిప్పులు చెరిగారు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. ఆయన మీడియాతో మాట్లాడారు. సత్త్వా రియల్ ఎస్టేట్ కంపెనీ వెనక ఎవరున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సత్త్వా ఐటీ కంపెనీ అని సర్కార్ ఊదరగొట్టిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ఎలా ఈ సంస్థకు కేటాయించారో చెప్పాలన్నారు గుడివాడ అమర్ నాథ్. రూ.1500 కోట్ల విలువ చేసే 30 ఎకరాల భూమి రూ.45 కోట్లకు ఎందుకిచ్చారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
సత్త్వా ఉద్యోగాలిచ్చే సంస్థ కానే కాదని, అది అద్దెలకు ఇచ్చుకునే కంపెనీ అని అన్నారు. 90 రోజులు అయినా డబ్బులు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. గడువు ఎందుకు పెంచారు..?50 శాతం ఇన్సెంటివ్స్.. 50% భూమిలో గృహ నిర్మాణాలకు అనుమతేంటీ..? ఇంతకన్నా దారుణం ఇంకెక్కడైనా ఉందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు గుడివాడ అమర్ నాథ్. ఈ భూ పందెరాన్ని ఆపేందుకు పోరాటం చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ కూటమి సర్కార్ కు. రాష్ట్రంలో పాలన సాగడం లేదని చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.






