భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎల్ వీ గంగాధర శాస్త్రి
హైదరాబాద్ : అంతర్జాతీయ గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త, ‘భగవద్గీతా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్ వి గంగాధర శాస్త్రి బాలయ్య నటించిన , బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ-2 మూవీపై ప్రశంసలు కురిపించారు. భారతీయ సనతాన ధర్మం గొప్పతనం ఏమిటో చెప్పారని అన్నారు. అఖండ-2′ చిత్రం అఖండ విజయం సాధించిన నేపధ్యం లో హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో విజయోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథి గా హాజరై తన స్పందన తెలియజేసారు.
‘రాగద్వేషాలకు అతీతం గా, విశ్లేషించి, విమర్శించే ధ్యేయం తో కాకుండా ఈ చిత్రం చూసినప్పుడు నాకు కలిగిన అనుభూతిని పంచుకోవడం కోసమే ఈ వేదికపైకి వచ్చానని అన్నారు.
రంధ్రాన్వేషణ ధ్యేయం తో కాకుండా, జ్ఞానాన్వేషణ ధ్యేయం తో కుటుంబ సమేతం గా చూసి, స్ఫూర్తి పొంది, మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవలసిన చిత్రం ‘అఖండ-2 అని అన్నారు. ఈ దేశం లో పుట్టినందుకు దర్శకులు బోయపాటి శ్రీను బాధ్యత తో తీసిన ఈ చిత్రాన్ని మనమూ బాధ్యతతో, కుటుంబ సమేతం గా ఆదరించి విజయం చేకూర్చాలని పిలుపునిచ్చారు గంగాధర శాస్త్రి. ఈ దేశం లోని అన్ని భాషల్లోనూ విడుదలై భారత దేశపు సనాతన ధర్మ బంధువులందరికీ చేరువవ్వాలని ఆశిస్తున్నానని అన్నారు. నా భగవద్గీతా సనాతన ధర్మ ప్రచార ప్రయాణం లో దశాబ్దాలుగా ప్రజలకు నేను ఏమి చెబుతున్నానో అది ఈ చిత్రం లో దర్శించి ఆనందించానని చెప్పారు. అఘోరా గా హీరో బాలకృష్ణ నట విశ్వరూపాన్ని ఈ చిత్రం లో చూసానని ప్రశంసించారు.. దైవభక్తి, దేశభక్తి, సనాతన ధర్మజ్ఞత కలిగిన ‘అఘోరా’ పాత్రలో ‘మరెవ్వరూ సాటి రారు’ అనిపించేంతగా అత్యద్భుతం గా నటించిన హీరో కు ఉత్తమ నటుడిగా ఈ చిత్రం ద్వారా జాతీయ అవార్డు పొందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.







