నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు
ఢిల్లీ : సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి విజ్ఞప్తి చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. విశాఖలో యూనిటీమాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్ లాక్ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్ విమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని కోరారు చంద్రబాబు. సాస్కీకింద రెండో విడత నిధులు మంజూరు చేయాలని అన్నారు. తీవ్ర ఆర్ధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద నిధులు కీలమని ఈ సందర్బంగా స్పష్టం చేశారు .వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టలు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులు మంజూరు చేయాలని కోరారు.
2025-26 ఆర్ధిక సంవత్సరంలో ఈ పనులకు గానూ రూ.10,054 కోట్లు సాస్కీ కింద మంజూరు చేయాలని విన్నవించారు నారా చంద్రాబు నాయుడు. రాయలసీమకు హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఆర్ధిక సాయం కోరుతూ విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రికి అంద చేశారు సీఎం. ప్రకాశం జిల్లాతో పాటు రాయలసీమ జిల్లాల్లో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న 18 పంటలను సాగు చేస్తోన్నట్టు విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కల్పిస్తాయని స్పష్టం చేశారు సీఎం. ఎగుమతులు చేసేందుకు వీలుగా ఉద్యాన ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పండుతున్నాయని తెలిపారు.





