కల్పించాలని ఆదేశించిన ఈవో సింఘాల్
తిరుపతి : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తన అధ్యక్షతన టీటీడీ పరిపాలనా భవనంలో ఎస్వీబీసీ ఛానల్ పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశంలో ఛానల్ సీఈవోతో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు అనిల్ కుమార్ సింఘాల్. భక్తులకు ఆహ్లాదం కలిగించడంతో పాటు స్వామి వారి విశిష్టత, చరిత్రను తెలిపేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.
ఎస్వీబీసీ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం మరో రెండేళ్ల పాటు క్రెడిట్ వైద్య సౌకర్యాలు కల్పించేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు అనిల్ కుమార్ సింఘాల్.
టిటిడిలో అన్యమతస్తులపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ఎస్వీబీసీలో టెక్నీషియన్ గా పనిచేస్తున్న అవాద్ బిన్ మొహ్సిన్ సనాజీ, ఆఫీస్ సబార్డినేట్ గా పనిచేస్తున్న ఎం.డి. ఖైసర్ పాషాలు వారి రికార్డుల్లో ముస్లిం వర్గాలుగా నమోదైనందున వారి కాంట్రాక్ట్ గడువు 31.12.2025తో ముగిసిన అనంతరం వారి సేవలను కొనసాగించరాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీబీసీ బోర్డు సభ్యులు బీ. ఆనందసాయి, ఎం.ఎస్. రాజులు వర్చువల్ గా పాల్గొనగా, ఎస్వీబీసీ ఇంఛార్జి సీఈవో డి. పణికుమార్ నాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.







