పూజలు చేసిన ఆనం, అనిత, అనగాని
తిరుమల : ఏపీ రాష్ట్రానికి చెందిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ బోర్డు సభ్యులు మంగళవారం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామి వారికి పూజలు చేశారు. వారికి సంప్రదాయ బద్దంగా స్వాగతం పలికారు చైర్మన్ నాయుడు. అనంతరం పూజారులు, అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. స్వామి వారి చిత్ర పటాలతో పాటు ప్రసాదాలను అందజేశారు.
అంతకు ముందు తిరుమల లోని అన్నమయ్య భవన్ లో కీలక సమావేశం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా టీటీడీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పాట్లపై ఆరా తీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 రోజుల పాటు సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రముఖులు, మంత్రులు, సెలెబ్రిటీలకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వడం లేదన్నారు మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి.





