ఎన్నుకున్న సర్కార్ ను కూల్చేస్తారా
కాంగ్రెస్ వైపు రాజయ్య చూపు
హైదరాబాద్ – దళితులందరికీ క్షమాపణలు చెబుతున్నానని ఇక గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎన్నుకున్న సర్కార్ ను కూల్చేస్తారా అంటూ నిప్పులు చెరిగారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడటం బీఆర్ఎస్ నేతలకు మంచి పద్దతి కాదన్నారు.
బీఆర్ఎస్ లో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం 2 నియోజకవర్గాలలో గెలిపించానని, ఆ క్రెడిట్ తనకు దక్కుతుందని చెప్పారు. అప్రజాస్వామికంగా సర్కార్ ను కూల్చి వేస్తానడం మంచి పద్దతి కాదన్నారు.
పార్టీ హై కమాండ్ పదే పదే తాము తల్చుకుంటే కాంగ్రెస్ సర్కార్ ను కూల్చి వేస్తామనడం తనను బాధకు గురి చేసిందన్నారు. దళిత నాయకులతో పాటు ప్రజలు తనను నిలదీస్తున్నారని, దీంతో తాను పునరాలోచించుకునేలా చేసిందన్నారు.
పలు పదవులు నిర్వహించానని, దళిత నేతలు తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకు వస్తున్నారని, ఆత్మ గౌరవం దెబ్బ తింటోందని , కొన్ని సమయాలలో తనను దూషించినా తాను పట్టించు కోలేదన్నారు. అందరి సూచనల మేరకు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించారు రాజయ్య.